యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. వైవిధ్యమైన కథలను తెరపై ఆవిష్కరించే సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2016 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా కానుకగా ఎన్.టి.ఆర్ తన అభిమానుల కోసం నాన్నకు ప్రేమతో ఫస్ట్ టీజర్ ని లాంచ్ చేసారు. సూపర్ క్లాస్ గా ఉన్న ఈ ఫస్ట్ టీజర్ కి అందరి నుంచీ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ తోనే ఆగకుండా ఈ టీజర్ యు ట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ ని సృష్టిస్తోంది.
ఇప్పటివరకూ యు ట్యూబ్ అతి తక్కువ టైంలో ఎక్కుబ లైక్స్ సాధించిన సినిమాగా సర్దార్ గబ్బర్ సింగ్ ఉంది. కానీ ఆ రికార్డ్ ని నాన్నకు ప్రేమతో టీజర్ బ్రేక్ చేసి అత్యధిక లైక్స్ ని సాధించింది. అలాగే కేవలం టీజర్ విడుదలైన 36 గంటల్లోనే 1 మిలియన్ మార్క్(10 లక్షల వ్యూస్)ని క్రాస్ చేసింది. తెలుగు సినిమా ఇంత తక్కువ సమయంలో 1 మిలియన్ వ్యూస్ ని పూర్తి చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్ర టీం లాంగ్ షెడ్యూల్ కోసం త్వరలోనే స్పెయిన్ వెళ్లనుంది.
టిజేర్ కోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


