విడుదల తేదీ : మార్చి 07, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : సోనూ సూద్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, శివ జ్యోతి రాజ్ పుత్, నజీరుద్దీన్ షాహ్, విజయ్ రాజ్ తదితరులు.
దర్శకుడు : సోనూ సూద్
నిర్మాణం: సోనాలి సూద్, ఉమేష్ బన్సల్
సంగీతం : జాన్ స్టీవర్ట్ ఎడూరి (స్కోర్), యో యో హనీ సింగ్, షబ్బీర్ అహ్మద్, హరూన్ – గావిన్, వివేక్ హరిహరన్ (పాటలు).
సినిమాటోగ్రఫీ : విన్సెంజో కాండోరెల్లి
ఎడిటర్ :యష్ పారిఖ్, చంద్రశేఖర్ ప్రజాపతి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
టాలీవుడ్ సహా బాలీవుడ్ లో కూడా తెలిసిన ప్రముఖ నటుడు సోనూ సూద్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ చిత్రమే “ఫతేహ్”. మొదట థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇపుడు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఇక కథలోకి వస్తే పంజాబ్ లోని మొగా అనే చిన్నపాటి గ్రామంలో ఫతేహ్ సింగ్ (సోనూ సూద్), ఒక డైరీ ఫామ్ లో సూపర్వైజర్ గా పని చేస్తుంటాడు. ఇరుగు పొరుగువారితో ఎంతో మంచిగా వారికి కష్ట సమయాల్లో ఆర్ధికంగా కూడా తాను సాయం చేస్తాడు. అయితే తన ఇంటి పక్కనే ఉండే నిమ్రత్ (శివ్ జ్యోతి రాజ్ పుత్) కిస్త్ పే అనే యాప్ లో లోన్ ఏజెంట్ గా తన ఊర్లో చాలా మందికి లోన్స్ ఇప్పిస్తుంది. కానీ ఈ లోన్స్ మాఫియా అంతా వారిని బ్లాక్ మెయిల్ చెయ్యడం స్టార్ట్ అవుతారు. అయితే ఈ అంతటిని రజా (నజీరుద్దీన్ షాహ్) చైనీస్ సైబర్ మాఫియాగా ఢిల్లీలో నడిపిస్తుంటాడు. ఈ క్రమంలో నమ్రత మిస్వ్వడం ఆమె కోసం ఫతేహ్ రంగంలోకి దిగడం జరుగుతుంది. అక్కడ నుంచి ఈ మాఫియాని ఫతేహ్ ఎలా అంతం చేస్తాడు? తన సోదరి సమానమైన నమ్రత్ ని కాపాడుకున్నాడా లేదా? అసలు ఫతేహ్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఈ మొత్తంలో హ్యాకర్ ఖుషి శర్మ (జాక్వెలిన్ ఫెర్నాండేజ్) పాత్ర ఎలా సాగింది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో మొదటిగా సోనూ సూద్ నుంచే మొదలు పెట్టాలని చెప్పవచ్చు. తాను ప్రస్తుత సమాజంలో చాలా కామన్ గా అనేకమంది ఎదుర్కొంటున్న సమస్యని మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ని జోడించి చూపించడం ఆడియెన్స్ కి ఒక డీసెంట్ ట్రీట్ ఇస్తుంది అని చెప్పాలి. మెయిన్ గా సోనూ సూద్ విజన్ సినిమాలో బాగుంది. యాక్షన్ ఎలిమెంట్స్ కానీ ఒక సీన్ నుంచి మరో సీన్స్ కి కట్స్ కానీ మంచి ఇంట్రెస్టింగ్ టేక్ లో కనిపిస్తాయి.
ఒక దర్శకునిగా సోనూ సూద్ నుంచి ఈ టాలెంట్ ని చాలా మంది ఊహించి ఉండకపోవచ్చు. ఇక వీటితో పాటుగా తన రోల్ లో పర్ఫెక్ట్ గా సోనూ సూద్ సెట్టయ్యారు. మంచి ఫిజిక్, సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో అదరగొట్టేశారని చెప్పాలి. ఇక తనతో పాటుగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి మంచి రోల్ దక్కింది. ఒక హ్యాకర్ గా ఆ రోల్ లో ఫిట్ అయ్యి మంచి లుక్స్ తో కనిపిస్తుంది.
ఇక వీరితో పాటుగా శివ్ జ్యోతి రాజ్ పుత్ మంచి తన రోల్ కి న్యాయం చేసింది. తనకి, సోనూ సూద్ నడుమ ఓ ఎమోషనల్ సీన్ బాగుంది. అలాగే నెగిటివ్ రోల్స్ లో కనిపించిన నజీరుద్దీన్ షాహ్ ఒక స్టైలిష్ విలన్ గా తన మార్క్ విలనిజాన్ని ప్రదర్శించారు. అలాగే విజయ్ రాజ్ కూడా షేర్ నెగిటివ్ షేడ్ లో బాగా చేశారు. ఇక వీటితో పాటుగా చిన్న చిన్న మాస్ మూమెంట్స్, డైలాగ్స్ సినిమాలో బాగున్నాయి. మెయిన్ గా మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ని కోరుకునే వారు ఈ సినిమాకి కనెక్ట్ కావచ్చు.
మైనస్ పాయింట్స్:
యాక్షన్ పరంగా సినిమా బాగానే సాగుతుంది కానీ అసలు కంప్లైంట్ సినిమా కథ అని చెప్పవచ్చు. ఈ కాన్సెప్ట్ లో ఆల్రెడీ పలు చిత్రాలు వచ్చాయి. మెయిన్ గా తమిళ్ లో విశాల్ నటించిన అభిమన్యుడు చిత్రానికి ఇది అనఫీషియల్ రీమేక్ అన్నట్టు అక్కడక్కడా అనిపించక మానదు.
విలన్ రోల్, ప్రస్తుత టెక్నాలజీ డేటా లతో ఏమేం చెయ్యొచ్చు బ్యాంక్ అకౌంట్స్ ఇలా చాలా సీన్స్ ఆ సినిమానే తలపిస్తాయి. ఇందులో కొంచెం స్టైలిష్ యాక్షన్ మూమెంట్స్ ని యాడ్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ సినిమా చూడనివారికి అయితే ఫతేహ్ మరింత నచ్చవచ్చు. కానీ ఆ తరహా సినిమాలు ఆల్రెడీ చూసిన వారికి మాత్రం ఫతేహ్ అంత గొప్పగా ఏమీ అనిపించదు.
ఇక దీనితో పాటుగా ఫతేహ్ రోల్ ఒక మోటివ్ తో స్టార్ట్ అవుతుంది కానీ ఆ మోటివ్ కొంత సమయం తర్వాత పక్కదారి పట్టినట్టుగా అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ కూడా ఇంకా అర్ధవంతంగా ఒక సుఖాంతంని సోనూ సూద్ ప్లాన్ చేయాల్సింది. అలాగే ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్ అనిమల్ లో సీన్ తలపిస్తుంది. ఇక్కడ కొత్తగా ఏమన్నా డిజైన్ చేయాల్సింది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మంచి స్టాండర్డ్స్ తో ఎక్కడా తగ్గకుండా మేకర్స్ తెరకెక్కించారు. అలాగే టెక్నికల్ టీంలో యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ కూడా ఓకే, కొన్ని సీన్స్ లో ఇంపాక్ట్ కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం ఫాస్ట్ గా ఉండాల్సింది.
ఇక దర్శకుడు సోనూ సూద్ విషయానికి వస్తే.. తాను డీసెంట్ సోషల్ ఎలిమెంట్ ని తీసుకున్నారు కానీ పలు సినిమాల్లో ఆల్రెడీ చూసినట్టే అనిపిస్తుంది. కాకపోతే దర్శకునిగా మాత్రం సోనూ సూద్ మెప్పిస్తాడు. నటీనటుల నుంచి మంచి పెర్ఫామెన్స్ లని రాబట్టడమే కాకుండా యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ని హ్యాండిల్ చేయడం కొన్ని సినిమాటిక్ షాట్స్ లో తన విజన్ డెఫినెట్ గా ఇంప్రెస్ చేస్తాయి. కాకపోతే ఇంకొంచెం బెటర్ ఎండింగ్ ని సినిమాకి ప్లాన్ చేసుకొని ఉంటే ఈ సినిమా మరింత మెప్పించి ఉండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఫతేహ్” చిత్రం యాక్షన్ మూవీ లవర్స్ కి ఒక డీసెంట్ ట్రీట్ ఇస్తుంది అని చెప్పవచ్చు. నటుడిగానే కాకుండా దర్శకునిగా కూడా సోనూ సూద్ మంచి ప్రయత్నం అందించారు. ఒకింత తెలిసిన సోషల్ కాన్సెప్ట్ నే తీసుకున్నప్పటికీ తన ఎఫర్ట్స్ సినిమాలో మెప్పిస్తాయి. ఈ చిత్రాన్ని ఇంకొంచెం బెటర్ గా షేప్ అవుట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అయినప్పటికీ ఈ చిత్రాన్ని యాక్షన్ మూవీ లవర్స్ అయితే ఓటిటిలో ఒకసారి ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team