లేటెస్ట్..”టక్ జగదీష్” రిలీజ్ పై తుది క్లారిటీ..!

Published on Aug 15, 2021 8:26 am IST


ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రాల్లో ఆల్రెడీ అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రం “టక్ జగదీష్”.. నాని హిట్ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ అండ్ మాస్ డ్రామా గత ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అప్పుడు పరిస్థితులు రీత్యా వాయిదా పడుతూ రావడం అలాగే ఏపీలో టికెట్ రేట్స్ ఇస్యూ కూడా పెరగడంతో ఈ సినిమా రిలీజ్ అగమ్యగోచరంగా మారింది..

అయితే ఏపీ లో మళ్లీ థియేటర్లు ఓపెన్ అయ్యి ప్రేక్షకులు ముందులానే వస్తున్నారని తెలియడంతో ఈ చిత్రాం థియేట్రికల్ రిలీజ్ పై ఆశలు చిగురించాయి. కానీ ఫైనల్ గా మాత్రం టక్ జగదీష్ ఎలా విడుదల కానుందో క్లారిటీ వినిపిస్తోంది.. ఈ చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కావడానికి రెడీగా ఉందట. దీనిపై ఇంకొన్ని రోజుల్లోనే అధికారిక క్లారిటీ రానున్నట్టుగా కూడా సమాచారం.. మరి ఆ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి..

సంబంధిత సమాచారం :