మోస్ట్ అవైటెడ్ “మాస్టర్”కు డేట్ ఫిక్స్..మేకర్స్ ఈ రిక్వెస్ట్ కూడా!

Published on Dec 3, 2020 11:00 am IST

ఇప్పుడు మన దక్షిణాది నుంచి వస్తున్న పలు భారీ చిత్రాల్లో ఇళయ థలపతి విజయ్ నటించిన చిత్రం “మాస్టర్” కూడా ఒకటి. భారీ అంచనాలను నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఎపుడు విడుదల అవుతుందా అని దక్షిణాది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అలా మోస్ట్ అవైటెడ్ సినిమాగా మారిన ఈ చిత్రం ఎట్టకేలకు ఒక రిలీజ్ డేట్ ను తెచ్చుకొంది. మొదటి నుంచీ అనుకుంటున్నా సమయానికే ఈ చిత్రాన్ని మేకర్స్ ప్లాన్ చేశారు. అదే వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఈ చిత్రాన్ని నిలుపుతున్నారు.

అందులో భాగంగా జనవరి 13న డేట్ ఫిక్స్ చేసుకొని తమిళనాడు ప్రభుత్వాన్ని ఓ రిక్వెస్ట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. థియేటర్స్ కు కేవలం 50 శాతం ప్రేక్షకులని కాకుండా 75 శాతం చూసే విధంగా అనుమతులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. వీరు డేట్ ను అయితే ఫిక్స్ చేసేసుకున్నారు కానీ మిగతా తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే అనుమతులను బట్టే ఆధార పడి ఉన్నట్టు తెలుస్తుంది.

టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ విజయ్, విజయ్ సేతుపతిలతో అందులోను అనిరుధ్ మ్యూజిక్ తో ప్లాన్ చేసిన ఈ భారీ చిత్రాన్ని చూసేందుకు మాత్రం ఆడియెన్స్ ఆగలేకపోతున్నారు. పలు భారీ ఓటిటి ఆఫర్స్ ను వదులుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి. ఈ చిత్రంలో విజయ్ సరసన మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించగా ఎక్స్ బి క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More