ఫైనల్ గా తెలుగులో ‘అయలాన్’ ఎంట్రీ.. ఓటిటిలో కాకుండా ఎక్కడంటే!

ఫైనల్ గా తెలుగులో ‘అయలాన్’ ఎంట్రీ.. ఓటిటిలో కాకుండా ఎక్కడంటే!

Published on Dec 14, 2025 4:18 PM IST

Ayalaan

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఇంట్రెస్టింగ్ సై ఫై కామెడీ చిత్రమే “అయలాన్”. ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్ లతో గతంలో మంచి బజ్ ని సొంతం చేసుకుంది. తమిళ్ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా తెలుగులో మాత్రం థియేటర్స్ లో విడుదల కాలేదు.

ఇప్పుడు ఎలా అయితే పలు సినిమాలు రిలీజ్ కి ముందు ఇబ్బందులు ఎదుర్కొన్నాయో అలానే ఎదుర్కొని విడుదల ఆగిపోయింది ఈ సినిమాకి. తర్వాత ఓటిటి ఎంట్రీ అయినా తెలుగులో ఉంటుంది అని చాలా మంది భావించారు. కానీ అది కూడా జరగలేదు. మరి ఫైనల్ గా ఈ సినిమా తెలుగులో ప్రేక్షకులని అలరించేందుకు రాబోతుంది. కానీ ఇది డైరెక్ట్ గా టెలివిజన్ లో కావడం విశేషం.

ఈ సినిమా శాటిలైట్ హక్కులు జీ సంస్థ సొంతం చేసుకోగా వారు ఈ డిసెంబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకి జీ తెలుగులో వరల్డ్ ప్రీమియర్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం అయినా చాలా మంది ఎదురు చూసారు. కానీ ఫైనల్ గా టీవిలో రాబోతుంది. మరి ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఆర్ రవికుమార్ దర్శకత్వం వహించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు