‘స్పిరిట్’ కోసం సందీప్ రెడ్డి ప్లానింగ్.. విలన్‌గా ఆయనేనా..?

‘స్పిరిట్’ కోసం సందీప్ రెడ్డి ప్లానింగ్.. విలన్‌గా ఆయనేనా..?

Published on Jan 24, 2026 1:01 AM IST

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్‌పై మేకర్స్ కొంతవరకు క్లారిటీ ఇచ్చేశారు. అయితే, మిగతా క్యాస్టింగ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ప్రభాస్, గోపీచంద్ ‘వర్షం’ సినిమాలో కలిసి నటించగా, సుమారు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కాబోతుందని తెలుస్తోంది. ఇక గోపీచంద్ ఈ చిత్రంలో విలన్‌గా కనిపిస్తారా లేక హీరోకి సపోర్టింగ్ రోల్ చేస్తారా అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సందీప్ వంగా సినిమాల్లో నెగటివ్ పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని పేరుంది. గోపీచంద్ కూడా గతంలో ప్రభాస్ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న విలన్ పాత్ర వస్తే చేస్తానని చెప్పడంతో, ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ప్రస్తుతం గోపీచంద్ మార్కెట్ కాస్త డల్‌గా ఉన్న సమయంలో ఇలాంటి ఒక భారీ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం ఆయన కెరీర్‌కు ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ కాంబో నిజంగానే సెట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు