ఎట్టకేలకు హిట్టు కొట్టిన దర్శకుడు.

Published on Jul 27, 2019 8:42 am IST

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి “నీతో” చిత్రంతో హీరోగా తెలుగు తెరకుపరిచయమై, “బొమ్మలాట” చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆ చిత్రం తరువాత సిధార్థ, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా “అనగనగా ఓ ధీరుడు” అనే జానపద కధా చిత్రం తెరకెక్కించారు.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. స్వీటీ అనుష్క తో చేసిన ప్రయోగాత్మక చిత్రం “సైజ్ జీరో” కూడా ఈ దర్శకుడికి విజయాన్ని అందిచలేకపోయింది.

కాగా నిన్న విడుదలైన “జడ్జిమెంటల్ హై క్యా” చిత్రం మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. కంగనా రనౌత్,రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “జడ్జిమెంటల్ హై క్యా” చిత్రానికి ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించారు. 2004లో దర్శకుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన ప్రకాష్ కి 2019లో “జడ్జిమెంటల్ హై క్యా చిత్రం” ద్వారా విజయం దక్కింది. ఆయన ఒక్క విజయం కోసం 15ఏళ్ళు ఎదురుచూశారన్న మాట.

“జడ్జిమెంటల్ హై క్యా” చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ఏక్తా కపూర్ నిర్మించారు. కంగనా రనౌత్,రాజ్ కుమార్ రావ్ గతంలో కలిసి నటించినా “క్వీన్” మూవీ ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ మూవీ విజయంతో వీరు బాలీవుడ్ లో హిట్ పెయిర్ గా గుర్తింపు పొందారు.

సంబంధిత సమాచారం :