హమ్మయ్య..ఎట్టకేలకు “రాధే శ్యామ్”పై అప్డేట్.!

Published on Jul 29, 2021 8:00 am IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం కోసం ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. దీనితో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని చూస్తుండగా పలు కారణాల చేత ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తుంది.

సరే ఎలాగో షూట్ అంతా కంప్లీట్ అయ్యింది అనుకుంటే మళ్ళీ రీ షూట్ పెట్టారు. మళ్ళీ దానిని సక్సెస్ ఫుల్ గా నిన్నటితో కంప్లీట్ చేసినట్టుగా దర్శకుడు రాధా కృష్ణ అధికారికంగా తెలిపాడు. అంతే కాకుండా ఆ ప్యాండమిక్ మీ అందరి అంచనాలను దెబ్బ తీసింది. కానీ ఓ అప్డేట్ ఇంకో మూడు రోజుల్లో మీకోసం వదులుతున్నట్టుగా రాధా క్లారిటీ ఇచ్చాడు. మరి ఆ అప్డేట్ ఏంటో అన్నది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :