మొత్తానికి రంగం సిద్ధం చేసిన జక్కన్న.!

Published on Sep 22, 2020 9:05 pm IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మన దక్షిణాది నుంచి వస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రం ఇపుడు నిలిచింది.

ఇప్పటికే చాలా మేర షూట్ పూర్తయిన ఈ చిత్రం లాక్ డౌన్ మూలాన వాయిదా పడింది. దీనితో మిగిలిన షూట్ కు అలా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మళ్ళీ షూటింగ్ బాట పట్టనుంది. ఇతర సినిమాల్లా కాకుండా మినిమమ్ ఎంత తక్కువలో చూసుకున్నా ఈ చిత్రం షూట్ కు వందలాది మంది క్రూ కావాల్సి వస్తుంది.

అందుకే తగు జాగ్రత్తలు తీసుకొని వచ్చే అక్టోబర్ రెండో వారం నుంచి ఈ చిత్రం షూట్ కు జక్కన్న రాజమౌళి రంగం సిద్ధం చేసినట్టు టాక్ తెలుస్తుంది. ఇక ఈ షూట్ మొదలయ్యాక ఒక సరైన సమయంలో తారక్ పై ప్లాన్ చేసిన టీజర్ వచ్చేయనుంది.మరి ఆ బిగ్ డే ఎప్పుడా అని యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More