ఫైనల్ గా “గేమ్ చేంజర్” నుంచి పండుగ లాంటి విజువల్ ట్రీట్ వచ్చేసింది.!

ఫైనల్ గా “గేమ్ చేంజర్” నుంచి పండుగ లాంటి విజువల్ ట్రీట్ వచ్చేసింది.!

Published on Mar 27, 2024 9:10 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బాలీవుడ్ బ్యూటీ కియారా (Kiara Advani) అద్వానీ హీరోయిన్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్” (Game Changer). మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి నేడు చరణ్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మొదటి సాంగ్ “జరగండి జరగండి” (Jaragandi Song) అయితే వచ్చేసింది.

మరి అప్పుడెప్పుడో జస్ట్ ఆడియో లీక్ అయితేనే ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ ఫుల్ క్లారిటీగా వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. శంకర్ మార్క్ భారీతనంతో చాలా కలర్ ఫుల్ గా ఒక పండుగలా ఈ సాంగ్ చూసేందుకు ఉందని చెప్పాలి. సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన బీట్స్ వాటికి చరణ్, కియారా ల నడుమ కెమిస్ట్రీని శంకర్ తన మార్క్ లో చిత్రీకరించారు.

మొత్తానికి అయితే ఈ సెన్సేషనల్ కాంబినేషన్ నుంచి కొన్నాళ్లపాటు మ్యూజిక్ ఛార్ట్స్ ని రూల్ చేసే మొట్ట మొదటి గ్రాండ్ విజువల్ చార్ట్ బస్టర్ వచ్చేసింది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య అలాగే సునీల్ తదితరులు నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో తమ బ్యానర్ లో 50వ సినిమాగా నిర్మాణం వహిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు