రూ.100 కోట్ల వసూళ్లు.. ఆ హీరోకి ఇదే మొదటిసారి

Published on Nov 12, 2019 11:44 am IST

హీరో కార్తి తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితుడు. ఆయన తాజా చిత్రం ‘ఖైథి’ రెండు భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కార్తి కెరీర్లో ఇదివరకే మంచి హిట్లు ఉన్నా ‘ఖైథి’ మాత్రం చాలా ప్రత్యేకం. హీరోయిన్, పాటలు, రొమాన్స్, స్పెషల్ కామెడీ ట్రాక్స్ లాంటి కమర్షియల్ హంగులేవీ లేకుండానే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది.

ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈమధ్య కాలంలో రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ తరహా చిత్రం ఇంకొకటి లేదు. పైగా కార్తికి మొదటి వంద కోట్ల గ్రాస్ సాధించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. తెలుగులోకి ‘ఖైదీ’ పేరుతో డబ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్నే సాధించింది. కంటెంట్ నమ్మి సినిమాను కొన్న పంపిణీదారులకు మంచి లాభాల్ని అందించింది.

ఈ భారీ విజయంతో కార్తి తర్వాతి సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. అలాగే మ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ సైతం స్టార్ డైరెక్టర్ అయ్యారు. ప్రస్తుతం విజయ్ సినిమాను చేస్తున్న అతనికి కమల్ హాసన్ నుండి కూడా పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More