వలిమై ఫస్ట్ సింగిల్ కోసం సర్వత్రా వెయిటింగ్!

Published on Aug 2, 2021 11:51 am IST


జీ స్టూడియోస్ మరియు బే వ్యూ ప్రాజెక్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం వలిమై. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోని కపూర్ నిర్మిస్తున్నారు. ప్రముఖ స్టార్ హీరో అజిత్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లో కార్తీక్ గుమ్మకొండ, హమ ఖురేషి, యమీ గౌతమ్, సుమిత్ర, యోగి బాబు లు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం వలిమై. అయితే ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే నేడు చిత్ర యూనిట్ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. అయితే నేడు ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వలిమై లవ్ అజిత్ మరొకసారి పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం :