ఎంఎల్ఎ నుండి మొదటి పాట వస్తోంది !
Published on Mar 4, 2018 11:22 am IST

కల్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌కత్వంలో విశ్వ‌ప్ర‌సాద్‌, భ‌ర‌త్ చౌద‌రి నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న సినిమా ఎంఎల్ ఎ. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా మొదటి పాట మోస్ట్ వాంటెడ్ అబ్బాయి రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చెయ్యనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.

లక్ష్మి కళ్యాణం సినిమా తరువాత కళ్యాణ్ రామ్కాజల్ మళ్ళి కలిసి పని చేస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కామెడి ఎపిసోడ్స్ బాగావచ్చాయని తెలుస్తోంది. న్యూ లుక్ లో కళ్యాణ్ రామ్ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ప్రసాద్ మురేళ్ళ ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

 
Like us on Facebook