ఫాలోయింగ్ లో మహేష్ ని మించిపోయేలా ఉన్నసితార.

Published on Jul 20, 2019 12:39 pm IST

మహేష్ గారాల పట్టి సితార పుట్టినరోజు నేడు.ఈ సంధర్భంగా సోషల్ మాధ్యమాలలో ఈ లిటిల్ ఏంజెల్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన తారలతో పాటు, మహేష్ అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ పెడుతున్నారు. సితార వయసు చిన్నదే అయినప్పటికీ సోషల్ మాధ్యమాలలో యాక్టీవ్ గా ఉంటుంది.

ఆమె తరచుగా క్యూట్ ఫొటోస్ పాటు, తన డాన్స్ వీడియోస్ లాంటివి పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఎహ్ డి బి లిటిల్ ప్రిన్సెస్ సితార యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ కావడం మరో విశేషము. ఏడేళ్ల వయసులోనే ఇంతటి ఫాలోయింగ్ సంపాదించిన సితారను చూస్తుంటే తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది. 2012 జులై 20న సితార జన్మించింది. ఆమె కి ఇప్పుడు ఏడేళ్ల వయసు. మహేష్ కూడా తన ముద్దుల కూతురిపై ప్రేమ కురిపిస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం :

X
More