సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ప్రభాస్

Published on Oct 23, 2019 9:09 am IST

డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ఆయన నేడు తన 40వ జన్మదినం జరుపుకోనున్నారు. ఈ స్టార్ హీరో పుట్టిన రోజు కారణంగా సోషల్ మీడియా షేక్ ఐపోతుంది. గత రాత్రి నుండి, అటు సినీ ప్రముఖులు,ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు. సామజిక మాధ్యమాలైన ట్విట్టర్, పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లలో ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు భారీ స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. తమ ఇష్టమైన హీరో ఆయురారోగ్యాలతో, సక్సెస్ ఫుల్ కెరీర్ తో ముందుకు సాగాలని కోరుకుంటున్నాడు.

బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ది సెపరేట్ ఇమేజ్. మాస్ ప్రేక్షకులలో ఏ స్థాయి ఇమేజ్ ఉందో అదే స్థాయి ఇమేజ్ లేడీ ఆడియన్స్ లో కలిగిన హీరో ప్రభాస్. చూడగానే పక్కింటి కుర్రాడిలా ఉండే ప్రభాస్ కి ఇండస్ట్రీలో వివాదరహితుడిగా పేరుంది.

2002లో జయంతి సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈశ్వర్ మూవీతో వెండితెరకు పరిచయమైన ప్రభాస్, మూడవ చిత్రం వర్షం తో మొదటి హిట్ అందుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నారు. యోగి,బిల్లా,మున్నా చిత్రాలు ప్రభాస్ మాస్ ఇమేజ్ ని పెంచుకుంటూ పోయాయి.

ఐతే డార్లింగ్ మూవీతో ఒక్క సారిగా అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. ఈ చిత్రం తరువాత ఆయనకు విపరీతమైన లేడీ ఫాలోయింగ్ వచ్చి చేరింది. మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలు ప్రభాస్ ని ఫ్యామిలీ హీరోగా నిలబెట్టాయి. ఇక బాహుబలి తో ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. లేటెస్ట్ గా విడువులైన సాహో చిత్రం నెగెటివ్ టాక్ తెచ్చుకుకొని కూడా 2019 ఆల్ ఇండియా హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా నిలిచిందంటే మనం ప్రభాస్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 123తెలుగు.కామ్ తరుపున ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

సంబంధిత సమాచారం :

X
More