2020 మొదటి ఇండియన్ మూవీగా అలవైకుంఠపురంలో ..!

2020 మొదటి ఇండియన్ మూవీగా అలవైకుంఠపురంలో ..!

Published on Jan 18, 2020 12:19 PM IST

అల వైకుంఠపురంలో చిత్రంతో బన్నీ యూఎస్ లో వసూళ్ల మోత మోగిస్తున్నాడు. విడుదలైన మొదటివారంలోనే ఈ చిత్రం అక్కడ $2 మిలియన్ వసూళ్లను చేరుకుంది. ఐతే 2020 కి గానూ యూఎస్ లో $2 మిలియన్ క్లబ్ లో చేరిన మొదటి ఇండియన్ మూవీ అల వైకుంఠపురంలో కావడం విశేషం. రజిని దర్బార్, మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ఈ $2 మిలియన్ మార్కుకి దగ్గరగా ఉన్నప్పటికీ ఇంకా చేరలేదు. అల వైకుంఠపురంలో త్వరగా ఆ మ్యాజిక్ ఫిగర్ చేరుకొని మొదటి చిత్రంగా నిలిచింది. అలాగే బన్నీ కెరీర్ లో కూడా మొదటి $1.5 మిలియన్ మరియు $ 2 మిలియన్ చిత్రం కూడా అల వైకుంఠపురంలో కావడం విశేషం.

అల వైకుంఠపురంలో మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ నిర్మించాయి. బన్నీకి జంటగా పూజ హెగ్డే నటించగా, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు వంటి వారు కీలక రోల్స్ చేశారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు