స్టార్ హీరో మూవీ కోసం ఏకంగా ఫుట్ బాల్ టోర్నమెంట్

Published on Oct 9, 2019 4:07 pm IST

తలపతి విజయ్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన బిగిల్ మూవీ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్ర ప్రచారం వినూత్నంగా నిర్వహిస్తున్నారు. బిగిల్ మూవీలో ఒక పాత్రలో విజయ్ లేడీ ఫుట్ బాల్ టీమ్ కోచ్ గా కనిపించనున్నాడు. కనుక చెన్నై వేదికగా ఒక ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. 64జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ ఈనెల 19 మరియు 20తేదీలలో రెండు రోజులు జరగనుంది. ఈ విజేతలకు హీరో విజయ్ చేతుల మీదుగా విలువైన బహుమతులు అందించనున్నారని సమాచారం.

ఇక విజయ్ కి జంటగా నయనతార నటించిన ఈ మూవీ ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతుండగా సంగీత దిగ్గజం ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో అట్లీ, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన మెర్సల్ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలున్నాయి. దాదాపు 180కోట్ల బడ్జెట్ వరకు ఈ మూవీ కొరకు వెచ్చించారని వినికిడి.

సంబంధిత సమాచారం :

X
More