“ఎఫ్3” కోసం మళ్ళీ ఆమెను తీసుకున్న అనీల్.?

Published on May 26, 2021 12:41 am IST

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ కౌర్ లు హీరోయిన్స్ గా నటించిన “ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్” మల్టీ స్టారర్ చిత్రం “ఎఫ్2”. దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

దీనితో ఈసారి కొత్తగా సీక్వెల్ ను ప్లాన్ చేసి చాలా మేర షూట్ ను మేకర్స్ కంప్లీట్ చేసేసారు. అయితే ఇప్పుడు మరో ఆసక్తికర బజ్ ఈ చిత్రంపై వినిపిస్తుంది. అనీల్ తన లాస్ట్ అండ్ సెన్సేషనల్ హిట్ “సరిలేరు వీకెవ్వరు”తో చాలా కాలం అనంతరం టాలీవుడ్ లోకి రెంటరీ ఇచ్చిన గ్లామరస్ నటి సంగీత ఇపుడు ఎఫ్ 3 లో కూడా నటించనున్నట్టు టాక్ వినిపిస్తుంది.

అలాగే ఈమెపై షాట్స్ ను ఆ మధ్య నిలిపివేసిన మైసూర్ షెడ్యూల్ లో తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది.అలాగే ఇందులో కూడా మంచి కామికల్ రోల్ నే డిజైన్ చేశారట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు, శిరీష్ లు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :