మహేష్ సినిమాకు కూడా త్రివిక్రమ్ నయా ట్రెండ్ లోనే.?

Published on May 5, 2021 2:10 pm IST

లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ అనౌన్స్ కాబడిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ నుంచే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ కాంబో పై రూమర్స్ కూడా ఎక్కువగానే మొదలయ్యాయి. ఈ సినిమా టైటిల్ నుంచి ఇప్పుడు హీరోయిన్స్ వరకు రచ్చ లేస్తుంది.

ఆల్రెడీ ఈ చిత్రంలో మహేష్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఫిక్స్ కాబడిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ త్రివిక్రమ్ లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా మరో హీరోయిన్ కూడా మహేష్ సరసన నటించే అవకాశం ఉందని టాక్ మొదలైంది. అయితే ఇది వరకు త్రివిక్రమ్ మరియు మహేష్ కాంబోలో వచ్చిన రెండు సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్ అనేది లేదు.

తర్వాత తర్వాత త్రివిక్రమ్ సినిమా ఖచ్చితంగా ఇద్దరు హీరోయిన్స్ అనే ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఆ ప్రకారం ఈసారి కూడా మరో హీరోయిన్ ను పెడతారని టాక్ వినిపిస్తుంది కానీ ఇంకా ఏదీ ఖరారు కాలేదు. మరి ఇది ఎంత వరకు నిజమవుతుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :