ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. కామెడీ ప్లస్ కన్నీళ్లు గ్యారెంటీ..!

Published on Jul 26, 2021 10:00 pm IST

తెలుగు బుల్లితెర‌ ప్రేక్షకులకు కడుపుబ్బా కామెడీని అందిస్తున్న కార్యక్రమాల్లో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కూడా ఒకటి. సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 1వ తేదిన ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ‘స్నేహమేరా జీవితం’ అంటూ ఈ కార్యక్రమం స్పెషల్ ఎపిసోడ్‌తో అలరించేందుకు రెడీ అయ్యింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది.

అయితే సినీ నటులు ప్రియదర్శి, అభినవ్‌ గోమటం మరికొందరు సీరియల్ నటులు షోకి వచ్చి సందడి చేశారు. తమ తమ స్నేహితుల గురించి అందరూ చర్చించుకున్నారు. గెటప్‌ శ్రీను, రామ్‌ ప్రసాద్‌, సుధీర్ ముగ్గురు కలిసి పాడిన ‘ఓ మై ఫ్రెండ్‌’ పాట అలరించింది. ఇక ఇమ్మాన్యుయేల్‌, నూకరాజు కలిసి చేసిన స్కిట్ అందరికి కన్నీళ్లు తెప్పించింది. కామెడీ ప్లస్ కన్నీళ్లు తెప్పించే ఈ ఫుల్ ఎపిసోడ్‌ను మిస్ కాకూడదంటే ఫ్రెండ్ షిప్ డే రోజు “శ్రీదేవి డ్రామా కంపెనీని” తప్పక చూడాల్సిందే. ఇక అంతవరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :