నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. అక్కడ నుంచి డీసెంట్ రన్ ని కొనసాగిస్తూ వెళుతున్న ఈ సినిమా సక్సెస్ ఫుల్ వారం రన్ ని కంప్లీట్ చేసేసుకుంది.
ఇలా డీసెంట్ బుకింగ్స్ తో కొనసాగుతున్న ఈ సినిమాతో బాలయ్య తన కెరీర్లో మరో 100 కోట్ల సినిమాని లిస్ట్ లో వేసుకున్నట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గత అఖండ 1 నుంచి మొదలు ఇప్పుడు అఖండ 2 వరకు తన నుంచి వచ్చిన ప్రతీ సినిమా 100 కోట్ల గ్రాస్ ని కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
సో ఒక రేర్ రికార్డు బాలయ్య కెరీర్లో పడింది అని చెప్పవచ్చు. ఇక అఖండ 2 లో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా అలాగే ఆది పినిశెట్టి తదితరులు నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించారు.


