ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఉత్కంఠ.!

Published on Sep 24, 2020 7:03 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా అతని పేరు వల్ల మరింత గ్రాండియర్ చేకూరుతుంది. అదే ఒక బడా డైరెక్టర్ అయితే మరింత ఇంపాక్ట్ ఇండియా వైడ్ నెలకొంటుంది. ఇపుడు అలాంటి ఒక ప్రాజెక్ట్ కు సంబంధించే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ప్రభాస్ చేతిలో దాదాపు 1000 కోట్లకు పైగా మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.

ఇక వీటితో పాటుగా మరో భారీ చిత్రాన్ని కూడా అనౌన్స్ చేయనున్నాడని గత కొన్నాళ్ల నుంచి టాక్ కూడా వస్తుంది. అదే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో. ఈ కాంబోకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం వినిపించలేదు కానీ గాసిప్స్ మాత్త్రం కాస్త గట్టిగానే వచ్చాయి. కానీ వీరి వర్గాల నుంచి మాత్రం ఎలాంటి మాటా లేదు.

దీనితో ఇపుడు లేటెస్ట్ టాక్ ప్రకారం వచ్చే అక్టోబర్ నెలలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్సమెంట్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. కానీ అసలు వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలవుతుంది అన్నదానికి సరైన థియరీ మాత్రం ఎవరి దగ్గరా దొరకడం లేదు. దీనితో ఈ బడా ప్రాజెక్ట్ ఎలా మొదలు కానుంది అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారిపోయింది..

సంబంధిత సమాచారం :

More