ధనుష్ మూవీ తెలుగు విడుదల హక్కులు దక్కించుకున్న మెగా హీరో నిర్మాతలు.

Published on Feb 17, 2020 3:21 pm IST

తమిళ హీరో ధనుష్ రెండు వరుస విజయాలు అందుకున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ఆయన చేసిన అసురన్ సూపర్ హిట్ కాగా వయసుకొచ్చిన ఇద్దరు కొడుకుల తండ్రిగా ధనుష్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సంక్రాంతికి ధనుష్ డ్యూయల్ రోల్ చేసిన పటాస్ మూవీ విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా ఆయన 40వ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్నాడు. వై నాట్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ఈనెల 19న విడుదల కానుంది.

కాగా ఈ చిత్ర తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా తెలుగు వర్షన్ డిస్ట్రిబ్యూటింగ్ రైట్స్ గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని వై నాట్ స్టూడియోస్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా తెలియజేశారు. ధనుష్ గత చిత్రాలు మంచి విజయం సాధించిన నేపథ్యంలో మంచి ధర చెల్లించి ధనుష్ మూవీ తెలుగు విడుదల హక్కులు దక్కించుకున్నారట. ఇక గీతా ఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్స్ కలిసి సాయి ధరమ్ హీరోగా ప్రతిరోజు పండగే చిత్రాన్ని నిర్మించగా సూపర్ హిట్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం :

X
More