అప్పుడే స్ట్రీమింగ్ కు వచ్చేసిన గత వారం సినిమా.!

Published on Mar 19, 2021 8:05 am IST

కరోనా నుంచి కోలుకున్నాకా తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్ళీ థియేటర్స్ పైకి సినిమా వరద మొదలయ్యింది. దీనితో ఎలా లేదన్నా వారానికి మూడు నోటెడ్ సినిమాలు పడిపోతున్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ రోజు శుక్రవారం కూడా మూడు సినిమాలు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే గత వారం కూడా ఓ మూడు సినిమాలు మంచి బజ్ ను ఏర్పర్చుకుని విడుదలకు వచ్చాయి.

వాటిలో జాతి రత్నాలు సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ మూడిట్లో టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన “గాలి సంపత్” కూడా ఒకటి. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో స్టార్ దర్శకుడు అనీల్ రావిపూడి సమర్పణలో వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. మరి ఇప్పుడు ఈ చిత్రమే వారం తిరక్కుండానే దిగ్గజ స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరియు తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో కూడా వచ్చేసింది. సో అప్పుడు మిస్సయిన వాళ్ళు ఇప్పుడు చూడొచ్చు.

సంబంధిత సమాచారం :