ఓటిటిలో భారీ రెస్పాన్స్ తో “గామి” సెన్సేషన్.!

ఓటిటిలో భారీ రెస్పాన్స్ తో “గామి” సెన్సేషన్.!

Published on Apr 19, 2024 12:04 PM IST


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “గామి”. మరి క్రౌడ్ ఫండింగ్ సినిమా అంటూ వచ్చిన ఈ చిత్రం ఈ మహా శివరాత్రి కానుకగా రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ని సాధించింది. అయితే ఈ సినిమా రీసెంట్ గానే ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ జీ 5 లో స్ట్రీమింగ్ కి రాగా ఇందులో ఈ సినిమా పాన్ ఇండియా సెన్సేషన్ గా మారింది.

అయితే ఈ చిత్రం లేటెస్ట్ గా ఏకంగా 100 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ని దాటి ఇంకా భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. ఆల్రెడీ జీ 5 లో ట్రెండింగ్ లో ఉన్న ఈ చిత్రాన్ని 250 కి పైగా సిటీలలో ఆడియెన్స్ అత్యధికంగా వీక్షిస్తున్నట్టుగా జీ 5 వారు చెబుతున్నారు. మరి మొత్తానికి అయితే ఓటిటి గామి సెన్సేషనల్ హిట్ అయ్యిందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి నరేష్ కుమారన్ సంగీతం అందించగా అభినయ, మహమ్మద్ షమద్ తదితరులు నటించారు. అలాగే వి సెల్యులాయిడ్ వారి సమర్పణలో ఈ చిత్రం రిలీజ్ కి వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు