“గామీ” నాన్ థియేట్రికల్ పార్టనర్స్ ఇవే!

“గామీ” నాన్ థియేట్రికల్ పార్టనర్స్ ఇవే!

Published on Feb 26, 2024 8:30 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ప్రధాన పాత్రలో, విద్యాధర్ కాగిత దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం గామీ. మార్చి 8, 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి, టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం యొక్క నాన్ థియేట్రికల్ పార్టనర్స్ పై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది.

ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను జీ 5 సొంతం చేసుకోగా, జీ తెలుగు ఛానెల్ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది. చాందినీ చౌదరి, MG అభినయ, మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి మరియు హారిక పెడద కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు