గాయత్రి టిజర్ రాబోతోంది !
Published on Jan 12, 2018 5:40 pm IST


డైలాగ్ కింగ్ మోహన్ బాబు రెండు విభిన్న పాత్రలో నటించిన సినిమా ‘గాయత్రి’ . శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సొంత బేనర్‌లో మోహన్ బాబు నిర్మిస్తోన్న ఈ సినిమాకు మదన్ దర్శకత్వం వహిస్తుండగా డైమండ్ రత్నబాబు కథ మాటలు అందించారు.షూటింగ్ మొత్తం పూర్తి అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

రేపు మధ్యానం 2 గంటలకు ఈ సినిమా టిజర్ విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో విష్ణు, శ్రియ మరో ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 
Like us on Facebook