అశోక్ పిక్చర్స్ పతాకం పై అమర్నాథ్ రెడ్డి గుంటక దర్శకత్వం లో ఆర్. కె .రెడ్డి నిర్మాణ సారథ్యంలో, ఇన్స్పిరేషనల్ 1980 కాలం నాటి పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రం గగన వీధి . ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో పాటు గా టైటిల్ ఫస్ట్ లుక్ తాజాగా లాంచ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ, పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్ర కథాంశానికి వస్తే, యువత తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనే చక్కటి మెసేజ్ తో కూడిన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది అని అన్నారు. ఈ చిత్రంలో అశ్వినీదత్ బ్యానర్ లో వచ్చిన మెయిల్ చిత్రం లో నటించి మంచి హిట్ కొట్టిన హర్షిత్ రెడ్డి హీరోగా, ఎన్నో చిత్రాల్లో నటించి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న సింధూరపువ్వు రాంఖీ, సినిమా బండి లో లీడ్ రోల్ చేసి అత్యుత్తమ ప్రదర్శన కనపరచిన వికాస్ వశిష్ఠ, నారప్ప లో చిన్నప్ప పాత్రలో చిన్నకొడుకుగా నటించిన రాఖీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు అని అన్నారు. ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో పాటు టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది అని, త్వరలో డిఫెరెంట్ ప్రమోషన్ తో మీ ముందుకు వస్తున్నామని అన్నారు. ఈ చిత్రాన్ని మీరందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నామని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీ చరణ్ పాకాల అందిస్తున్నారు. జీ. ఎల్. ఎన్ బాబు సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు.


