‘గేమ్ ఛేంజర్’ నెక్స్ట్ షెడ్యూల్ అప్ డేట్

‘గేమ్ ఛేంజర్’ నెక్స్ట్ షెడ్యూల్ అప్ డేట్

Published on Mar 19, 2024 1:02 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని శంకర్ తెరకెక్కిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మూవీలో శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్, అంజలి తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి తిరు ఫోటోగ్రఫి అందిస్తున్నారు. మ్యాటర్ ఏమిటంటే, కొన్నాళ్లుగా వైజాగ్ లో జరుగుతున్న ఈ మూవీ షెడ్యూల్ నేటితో పూర్తి కాగా. రెండు రోజుల గ్యాప్ తర్వాత, అనగా 21న హైదరాబాద్ నెక్స్ట్ షెడ్యూల్ మొదలవుతుందట. ఇక ఈ షెడ్యూల్ లో టాకీపార్ట్ చాలావరకు ఫినిష్ అవుతుందని, దీని తర్వాత బుచ్చి బాబు సన తెరకెక్కించనున్న RC16 మూవీ వర్క్ తో బిజీ అవుతారట రామ్ చరణ్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు