సమీక్ష: “గాంధీ తాత చెట్టు” – కొన్నిచోట్ల మెప్పించే ఎమోషనల్ డ్రామా

సమీక్ష: “గాంధీ తాత చెట్టు” – కొన్నిచోట్ల మెప్పించే ఎమోషనల్ డ్రామా

Published on Jan 24, 2025 8:05 PM IST
Gandhi Tatha Chettu Movie Review In Telugu

విడుదల తేదీ : జనవరి 24, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సుకృతి వేణి బండ్రెడ్డి, ఆనంద్ చక్రపాణి, రాగ మయూర్, భాను ప్రకాష్, నేహల్ తదితరులు

దర్శకుడు : పద్మావతి మల్లడి

నిర్మాతలు : శేష సిందూరావు, నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి

సంగీతం : రీ

ఛాయాగ్రహణం : విశ్వ దేవుబత్తుల, శ్రీజిత చెరువుపల్లి

కూర్పు : హరిశంకర్ టీఎన్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి నటించిన చిత్రం “గాంధీ తాత చెట్టు” కూడా ఒకటి. మంచి ప్రమోషన్స్ ని జరుపుకుని థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

2000 సంవత్సరం సమయంలో జరిగే కథ.. అడ్లూరు అనే గ్రామంలో రామ చంద్రయ్య(ఆనంద్ చక్రపాణి) తను స్వాతంత్ర్య సమయం నుంచే గాంధేయవాది కావడంతో గాంధీ చనిపోయిన రోజున తన పొలంలో ఒక వేపచెట్టుని గుర్తుగా పెంచుతారు. మరి ఈ రామ చంద్రయ్య మనవరాలే గాంధీ(సుకృతి వేణి). తాత అంటే ఎంతో ప్రేమ కలిగిన గాంధీ తన తాత దగ్గర తీసుకున్న మాట ఏంటి? తన తాతయ్యకి ఎంతో ప్రాణమైన చెట్టు కోసం అలాగే తన ఊరి కోసం ఏం చేసింది అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

స్టార్ దర్శకుడు సుకుమార్ కూతురుగా సుకృతి తన డెబ్యూ ఇచ్చినప్పటికీ ఈ చిత్రంతో తను ఆశ్చర్య పరుస్తుంది అని చెప్పాలి. ఈ సినిమా కోసం మేకోవర్ ని కూడా మార్చుకునే సాహసం చేసి మెప్పించింది. ఈ విషయంలో సుకృతిని మెచ్చుకొని తీరాలి. ఇక తన పెర్ఫామెన్స్ లో కూడా చాలా బాగా చేసింది. ఒక అమాయకమైన పల్లెటూరి చిన్నారిగా చాలా బాగా చేసింది. ఎమోషనల్ సీన్స్ తనపై బాగా పండాయి. నటిగా సుకృతి మాత్రం ఈ సినిమాలో ఇంప్రెస్ చేస్తుంది.

అలాగే నటుడు ఆనంద్ చక్రపాణి తన రోల్ లో బాగా చేశారు. మెయిన్ గా తన రోల్ చెప్పే డైలాగ్స్ సినిమాలో చాలా బాగున్నాయి. వీరితో పాటుగా కీడా కోలా నటుడు రాగ్ మయూర్ తన రోల్ లో మెప్పించాడు. కొన్ని నెగిటివ్ షేడ్స్, అలాగే ఎమోషనల్ సీన్స్ లో బాగా చేసాడు. ఇంకా వీరితో పాటుగా సుకృతి ఫ్రెండ్స్ గా కనిపించిన నేహల్ ఆనంద్, భాను ప్రకాష్ లు కూడా బాగా చేశారు. వీరి ముగ్గురు నడుమ పలు కామెడి సీన్స్ మెప్పిస్తాయి.

ఇక వీరితో పాటుగా రఘురాం, లావణ్య, శ్రీధర్ రెడ్డి తదితరులు తమ పాత్రల్లో బాగా చేశారు. అలాగే సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ పలు ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి అనిపిస్తుంది. మెయిన్ గా సుకృతి రోల్ కి గాంధీ అనే పేరు గాంధీ తీసుకున్న అహింస మార్గం తోనే సమస్య పరిష్కారం చేయొచ్చు అనే పాయింట్ తో ఎండింగ్ బాగుంది.

మైనస్ పాయింట్స్:

ఈ తరహా చిత్రాలు ఆడియెన్స్ కి మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చినవి ఇది వరకు కొన్ని వచ్చాయి. అయితే వాటిలో కనిపించిన బలమైన ఎమోషన్స్, కథనాలు ఈ సినిమాలో లోపించాయి అని చెప్పక తప్పదు. లైన్ ఓకే కానీ కథనం మాత్రం అలా సాగదీతగా అనిపిస్తుంది.

స్లోగా అలా ఓకే అనిపించే రేంజ్ లో ఈ సినిమా వెళితే ఇందులో కొన్ని సీన్స్ మరీ అంత ఎమోషనల్ గా అనిపించవు. అలాగే చాలా సీన్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే ఇంకా కొన్ని లాజిక్స్ కూడా బాగా మిస్ అయ్యాయి.

ఊర్లో ఒక సమస్య ఉంటే దానికి పరిష్కార మార్గం సుకృతి పాత్రే చూపించడం అనేది సిల్లీగా అర్ధ రహితంగా అనిపిస్తుంది. తను చేసిన రెసిపీ ఐడియా కోసం ఆ ఊర్లో ఒకరికి కూడా తెలీకుండా ఉంటుందా? ఇది ఒకింత సిల్లీగా అనిపిస్తుంది. అలాగే చాలా సీన్స్ ని ఇంకా బెటర్ గా మరింత స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ప్రెజెంట్ చేయాల్సింది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా చేసిన ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. డైలాగ్స్ బాగున్నాయి. ఇక దర్శకురాలు పద్మావతి మల్లడి విషయానికి వస్తే.. తన వర్క్ సినిమాకి జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో మాత్రమే ఉందని చెప్పాలి. లైన్ బాగానే ఉంది కాని కథనం ఇంకా స్ట్రాంగ్ ఎమోషన్స్ తో నడిపిస్తే బాగుండేది. ఈ విషయంలో తను ఇంకా హోమ్ వర్క్ చేయాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “గాంధీ తాత చెట్టు” లో తన తొలి సినిమాతోనే సుకృతి వేణి షైన్ అయ్యింది అని చెప్పవచ్చు. తన పెర్ఫామెన్స్ సినిమాలో ప్రధాన బలం కాగా తనపై నడిచే పలు ఎమోషనల్స్ సీన్స్ బాగున్నాయి. అలాగే శాంతితో కూడా యుద్దాలు ఆపొచ్చు అనే పాయింట్ క్లైమాక్స్ లో కదిలిస్తుంది. కాకపోతే సినిమా కొంచెం స్లోగా అక్కడక్కడా డల్ మూమెంట్స్ తో సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ తరహా క్లీన్, వైలెన్స్ లేనటువంటి అవార్డు విన్నింగ్ సినిమాలు బాగానే అనిపిస్తాయి కానీ కమర్షియల్ గా సక్సెస్ కాకపోవచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకొని ట్రై చేస్తే మంచిది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు