ప్రభాస్ కజిన్ హీరోగా “వీరమల్లు” కొరియోగ్రాఫర్ డైరెక్టర్ సాలిడ్ ప్రాజెక్ట్

ప్రభాస్ కజిన్ హీరోగా “వీరమల్లు” కొరియోగ్రాఫర్ డైరెక్టర్ సాలిడ్ ప్రాజెక్ట్

Published on Apr 10, 2024 11:21 AM IST

మన తెలుగు సినిమాలో ఎప్పటికప్పుడు యంగ్ టాలెంట్ పరిచయం అవుతూనే ఉన్నారు. అలా ఆల్రెడీ సెటిల్ అయ్యిన స్టార్ హీరోస్ ఫామిలీస్ నుంచి కూడా తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోడానికి కొందరు యువ హీరోస్ వస్తుంటారు అలా ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) కజిన్ విరాట్ రాజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అది కూడా ఈ చిత్రాన్ని ప్రముఖ డాన్స్ మాస్టర్ గణేష్ మాస్టర్ దర్శకత్వం వహించనుండడం విశేషం.

గణేష్ మాస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, భీంలా నాయక్ ఇప్పుడు హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) పాటలకి కొరియోగ్రాఫ్ చేసిన తాను ఇప్పుడు డెబ్యూ ఇస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి “గౌడ్ సాబ్” గా అయితే టైటిల్ ని ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు. ఈ సినిమా లాంచ్ కి గాను టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ వచ్చి గ్రేస్ చేశారు. మరి ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ కి శ్రీపాద పాద ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తుండగా వేంగి సంగీతం అందిస్తున్నారు. అలాగే మరిన్ని వివరాలు త్వరలో రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు