‘గ్యాంగ్ లీడర్’ రివేంజ్‌ ఎంటర్టైనర్‌ – నాని

‘గ్యాంగ్ లీడర్’ రివేంజ్‌ ఎంటర్టైనర్‌ – నాని

Published on Aug 27, 2019 3:00 AM IST

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా – స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘గ్యాంగ్ లీడర్’. కాగా ఈ సినిమా అవుట్ ఫుట్ గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ ‘గ్యాంగ్‌లీడర్‌’ అనేది ఫస్ట్‌ నుండి మాకు చాలా హ్యాపీ ప్రాజెక్ట్‌. టీమ్‌ అందరం ఎంతో ఇష్టపడి ఎంజాయ్‌ చేస్తూ సినిమా చేశాం. నా అన్ని సినిమాల్లో నేను ఎక్కువ ఎంజాయ్‌ చేసిన సినిమా ఇదే. ప్రతి ఒక్కరూ ఒక పాజిటివ్‌ ఎనర్జీతో సినిమా స్టార్ట్‌ చేశారు. అందుకు తగ్గట్లే మంచి అవుట్‌ ఫుట్‌ వచ్చింది. సినిమా విడుదలకోసం చాలా ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాం. ఇది రివేంజ్‌ ఎంటర్టైనర్‌ అనే కొత్త జోనర్‌ ఉండే సినిమా. ఈ సినిమాలో మా గ్రూప్‌ పేరు రివెంజర్స్‌ అసెంబుల్డ్‌. తప్పకుండా మిమ్మల్ని ఎంటర్‌ టైన్‌ చేస్తుంది’ అన్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ పతాకం పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ ఆగష్టు 28 న విడుదలకాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు