నానికి కమర్షియల్ హిట్ ఇస్తోందా ?

Published on Aug 25, 2019 9:53 am IST

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా – స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘గ్యాంగ్ లీడర్’. కాగా ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందట. సరికొత్త కంటెంట్ తో రివేంజ్ డ్రామాతో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాని క్యారెక్టర్ చాల బాగుంటుందని.. నాని క్యారెక్టర్ చుట్టూ ఉండే పాత్రల ప్రభావం వల్ల, తెలియకుండానే నాని చేసే యాక్టివిటీస్ అలాగే కొన్ని కీలక సన్నివేశాలు చాలా కామెడీగా సాగుతాయట. అయితే నాని ‘జెర్సీ’ సూపర్ సక్సెస్ అయినా, సినిమా రేంజ్ కి తగ్గట్లు కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మరి నానికి ఈ సినిమానైనా కమర్షియల్ హిట్ ఇస్తోందేమో చూడాలి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న చెన్నై బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ టాలీవుడ్ లో ఎంతవరకూ నెట్టుకొస్తోందో.. అలాగే ఇటీవలే గుణ అంటూ మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. అలాగే ఇతర కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు, సత్య నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 13న వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ కూడా రిలీజ్ కాబోతుంది. మరి ‘గ్యాంగ్ లీడర్’ ‘వాల్మీకి’ చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఏది ముందడుగులో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :