నాని గ్యాంగ్ లీడర్ ట్రైలర్ కి టైం అయ్యింది.

Published on Aug 27, 2019 1:19 pm IST

నాని గ్యాంగ్ లీడర్ మూవీ ట్రైలర్ విడుదలకు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేశారు. రేపు ఉదయం 11 గంటలకి గ్యాంగ్ లీడర్ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల 13న ఈ చిత్ర విడుదల నేపథ్యంలో రేపు గ్యాంగ్ లీడర్ ట్రైలర్ విడుదల చేయనున్నారు. దీనితో నాని ఫ్యాన్స్ ట్రైలర్ కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నాని ఈ చిత్రంలో గతానికి భిన్నంగా రైటర్ గా చేస్తున్నారు. ఒక వ్యక్తిపై పగబట్టిన ఐదుగురు ఆడవాళ్లకి రైటర్ నాని ఎలా సహాయం చేశాడనే విభిన్న కథాంశంతో దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :