‘గ్యాంగ్, రంగుల రాట్నం’ కృష్ణా లేటెస్ట్ కలెక్షన్స్ !


జనవరి 12న సంక్రాతి కానుకగా విడుదలైన సినిమాల్లో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘గ్యాంగ్’ చిత్రం మొదటిరోజే పాజిటివ్ మౌత్ టాక్ తెచ్చుకుంది. దానికి తోడు సూర్య స్వయంగా అన్ని జిల్లాకు తిరుగుతూ థియేటర్లకు వెళ్లి అభిమానుల్ని పలకరిస్తుండటంతో వసూళ్లు ఇంకాస్త పుంజుకున్నాయి. కృష్ణా ఏరియాలో 5వ రోజు రూ.9.70 లక్షల షేర్ ను వసూలు చేసిన ఈ చిత్రం మొత్తంగా రూ. 36.19 లక్షల షేర్ ను అందుకుంది.

ఇక అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో యంగ్ హీరో రాజ్ తరుణ్, చిత్రా శుక్లా హీరో హీరోయిన్లుగా నూతన దర్శకురాలు శ్రీరంజని తెరకెక్కించిన ‘రంగుల రాట్నం’ 3వ రోజు అనగా నిన్న 16వ తేదీన రూ.5.33 లక్షల షేర్ ను రాబట్టి మొత్తం రూ. 14.79 లక్షల షేర్ ను రాబట్టుకుంది.