టాప్ 3లో నిలిచిన గంగ?

టాప్ 3లో నిలిచిన గంగ?

Published on May 18, 2015 11:33 PM IST

ganga
హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ‘కాంచన’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ‘ముని’ సినిమాకు సీక్వెల్‌గా ‘కాంచన’ తెరకెక్కగా, ముని సిరీస్‌లో మూడో సినిమా ‘గంగ(ముని 3)’ తెరకెక్కింది. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మే 1న విడుదలైన ఈ సినిమా తెలుగు వర్షన్ కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలై రెండు వారాలైనా మాస్ పవర్ చూపిస్తూ దూసుకుపోతోంది.

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గంగ’ సినిమాకు తమిళంతో పాటు తెలుగులోనూ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఔట్ అన్డ్ ఔట్ మాస్ హర్రర్ కామెడీగా తెరకెక్కిన ‘గంగ’.. టార్గెట్ ఆడియన్స్‌ని అమితంగా ఆకట్టుకుంటోంది. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా లభించడంతో మొదటి రెండు వారాలు ముగిసేసరికి ఈ సినిమా 20కోట్ల షేర్ సాధించినట్టు తెలుస్తోంది. ఓ తమిళ సినిమాకు ఈ స్థాయి కలెక్షన్లు రావడం ఓ రకంగా రికార్డే! తెలుగులో మంచి క్రేజ్ సంపాదించిన ‘రోబో’, ‘ఐ’ సినిమాల తర్వాత గంగ మూడో స్థానంలో నిలిచినట్టు టేడ్ టాక్!

రాఘవ లారెన్స్, తాప్సీ, నిత్యా మీనన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో వారి యాక్టింగ్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో బెల్లంకొండ సురేష్ విడుదల చేసిన విషయం తెలిసిందే!

తాజా వార్తలు