నైజాంలో 15 కోట్ల మార్క్ దిశగా ‘గోవిందుడు అందరివాడేలే’

GAV_TG
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారి తన కమర్షియల్ ఫార్మాట్ నుంచి పక్కకి వచ్చి చేసిన అచ్చ తెలుగు కుటుంబ కథా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. దసరా కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్ చేత సూపర్బ్ అనిపించుకుంటోంది. ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఒక్క నైజాంలోనే 9.6 కోట్ల షేర్ సాధించిందని తెలియజేశాం.

మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా సెకండ వీకెండ్ మొదలయ్యే లోపు, అనగా గురువారంతో(రేపటితో) ఒక్క నైజాంలోనే 15 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. వీక్ డేస్ లో కూడా ఫుల్ కలెక్షన్స్ వస్తుండడంతో ఇదే విషయాన్ని డిస్ట్రిబ్యూటర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. చరణ్ కెరీర్లో నైజాంలో 15 కోట్ల మార్క్ క్రాస్ చేసిన సినిమాల లిస్టులో ‘గోవిందుడు అందరివాడేలే’ కూడా చేరనుంది.

కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ నిర్మించారు. కాజల్ గర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ముఖ్య పాత్రలు చేసాడు.

Exit mobile version