ఆగష్టు 25 నుంచి గోవిందుడి లండన్ షెడ్యూల్

Published on Aug 19, 2014 9:25 am IST

Govindu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఫారిన్ నుంచి ఇండియాకి వచ్చే కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు. కథానుగుణంగా ఈ సినిమాలోని కీలకమైన పార్ట్ ని లండన్ లో షూట్ చేస్తారని ఇది వరకే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఆగష్టు 25 నుంచి ఈ చిత్ర టీం లండన్ షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు. ఈ లండన్ షెడ్యూల్ ఆగష్టు 25 నుండి సెప్టెంబర్ 12 వరకూ జరగనుంది.

లండన్ షెడ్యూల్ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి మిగిలి ఉన్న ఓ పాటని మరియు ఫైనల్ టాకీ పార్ట్ ఎపిసోడ్స్ ని షూట్ చేస్తారు. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కుటుంబకథా చిత్రాలు తీయడంలో మంచి పేరు ఉన్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం :