‘సరిలేరు నీకెవ్వరు’.. టీజర్ లోడింగ్ !

Published on Nov 16, 2019 9:21 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఒకపక్క షూటింగ్ ను జరువుకుంటూనే, మరోపక్క ప్రమోషన్స్ పనులను కూడా వేగవంతం చేసింది. కాగా తాజాగా ఈ చిత్రం నుండి చిత్రబృందం ఆసక్తికరమైన అప్ డేట్ ఇచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ లోడింగ్ అవుతుందని.. టీజర్ అతి త్వరలోనే మీ ముందుకు రాబోతుందని సోషల్ మీడియా ద్వారా చిత్రయూనిట్ తెలిజేశారు.

కాగా ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More