
ప్రతి నెల తెలుగు ఫిల్మ్ చాంబర్ లో పలువురు నిర్మాతలు తమ బ్యానర్ పై సినిమా టైటిల్స్ ని రిజిస్టర్ చేస్తూ ఉంటారు. టాలీవుడ్ లోని ఒక స్టార్ ఇమేజ్ ఉన్న ప్రొడక్షన్ బ్యానర్ నుంచి ఓ క్రేజీ టైటిల్ రిజిస్టర్ అయ్యింది అంటే.. ఆ సినిమాలో ఎవరు హీరో, హీరోయిన్ ఎవరు, ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అనే అనుమానాలు తలెత్తుతాయి. ఇప్పుడు అదే రీతిలో ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ అయిన గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఓ క్రేజీ టైటిల్ రిజిస్టర్ అయ్యింది. ఆ టైటిల్ ‘చరణ్ – అర్జున్’. మెగా హీరోలకి సంబందించిన అల్లు బ్యానర్ లో చరణ్ అర్జున్ అనే టైటిల్ తో టైటిల్ రిజిస్టర్ అయ్యింది అనగానే ఈ టైటిల్ పై ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ టైటిల్ లోనే ఇద్దరు మెగా హీరోలైన రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ పేర్లు ఉండడంతో.. వాళ్ళిద్దరూ కలిసి మరోసారి మరో స్టారర్ లో కలిసి నటించనున్నారా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. ఒకవేళ అలా కాదు అనుకుంటే ఈ మధ్య గీత ఆర్ట్స్ బ్యానర్ వారు స్మాల్ బడ్జెట్ సినిమాలకు శ్రీకారం చుట్టింది. ఏదైనా స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ కి క్రేజ్ తీసుకురావడం కోసం ఈ పేరు పెట్టారా అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ టైటిల్ పై గీత ఆర్ట్స్ నుంచి అధికారిక ప్రకటన ఉంది. ఒకవేళ రామ్ చరణ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చే మూవీకి ఇది టైటిల్ అయితే మాత్రం ఆ సినిమా మెగా అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి.

