గీత గోవిందం ప్రభావం అక్కడ కూడా పడుతుందట !
Published on Aug 19, 2018 5:43 pm IST

విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ఇటీవల విడుదలై అదిరిపోయే కలెక్షన్స్ ను రాబడుతూ బ్లాక్ బ్లాస్టర్ విజయం వైపు దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రం తమిళనాడులోకూడా విడుదలైయింది. మొదటి రోజే 1. 30కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది.

ఇక ఇప్పటికి అక్కడ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తుండడం తో అక్కడ విడుదలయ్యే చిత్రాలపై ఈ సినిమా ప్రభావం చూపుతుందట. కేవలం 28లక్షలకు ఈ చిత్రాన్ని సొంతం చేసుకొని తమిళనాడులో విడుదలచేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ శక్తీ ఫిల్మ్ ఫ్యాక్టరీ రెండో రోజుకే బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది.

పరుశురాం తెరకెక్కించిన ఈ చిత్రం లో విజయ్ కు జోడిగా రష్మిక నటించింది. గీతా ఆర్ట్స్ 2పతాకం ఫై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook