‘విశ్వాసం’ డైరెక్టర్ తో సూర్య ఫిక్సే !

Published on Mar 23, 2019 4:22 pm IST

మొత్తానికి హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య . దర్శకుడు శివ చెప్పిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. పక్కా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందట.

ఇక దర్శకుడు శివ ఇటీవలే తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా ‘విశ్వాసం’ను తెరకెక్కించి తమిళంలో భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే తెలుగులో మాత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మరి శివ – సూర్య కాంబినేషన్ లో వచ్చే సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ హిట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More