ఆకట్టుకుంటున్న ‘జార్జి రెడ్డి’ విజయం సాంగ్ !

Published on Nov 13, 2019 10:23 pm IST

ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి ‘జార్జి రెడ్డి’. సమసమాజ స్థాపనే ధ్యేయంగా జార్జిరెడ్డి ప్రస్థానం సాగింది. అలాంటి ఆదర్శనీయమైన ఈ విద్యార్థి నేత బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ‘వంగవీటి’ ఫేం సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి రోల్ లో నటిస్తోన్న ఈ సినిమా నుండి తాజాగా ‘విజయం’ అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల అయింది. ‘ఈ సమరం మనది అయితే విజయం మనదే కదా..’ అంటూ సాగిన ఈ సాంగ్ జార్జ్ రెడ్డి ఆలోచనలను ఆశయలను చాల చక్కగా ఎస్టాబ్లిష్ చేసింది. అలాగే సాంగ్ లో ప్లే అయిన కొన్నిమోంటేజ్ షాట్స్ లో కూడా 1960 – 70 కాలం నాటి సంఘటనలను అప్పటి ఉస్మానియా యూనివర్శిటీలోని విద్యార్థి ఉద్యమాలను బాగా చూపించారు.

అలాగే అప్పటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను కూడా ఈ సాంగ్ బాగా గుర్తుచేసింది. కాగా ప్రస్తుతం ఈ సాంగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్ తో కలిసి త్రీ లైన్స్, ‘‘సిల్లీ మాంక్స్ స్టూడియో’’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో సత్య దేవ్ గెస్ట్ రోల్ చేస్తుండగా మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ప్రముఖ మరాఠీ నటి దేవిక ‘‘జార్జి రెడ్డి’’ తల్లి పాత్రలో నటిస్తుండటం విశేషం.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More