గెట్ రెడీ..అవైటెడ్ “బిగ్ బాస్ 5” అనౌన్స్మెంట్ వచ్చేసింది!

Published on Aug 1, 2021 2:00 pm IST


ఒక్క తెలుగు స్మాల్ స్క్రీన్ హిస్టరీ లోనే కాకుండా వరల్డ్ వైడ్ కూడా అత్యంత పాపులారిటీ సంతరించుకున్న గ్రాండ్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు మన తెలుగులో మొత్తం నాలుగు సీజన్లను కంప్లీట్ చేస్తున్న ఈ షో ఇప్పుడు ఐదవ సీజన్లోకి అడుగు పెట్టింది. మరి గ్రాండ్ షో ఎప్పుడు మొదలు అవుతుందా అన్న సమయంలో మేకర్స్ ఇప్పుడు అదిరే అప్డేట్ ఇచ్చారు.

ఈసారి సీజన్ బిగ్ బాస్ లోగో ఎలా ఉంటుందో దాని ద్వారా సీజన్ కూడా ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో అన్నది రివీల్ చేశారు. ఒక చిక్కుముడి లాంటి మేజ్ నుంచి తప్పించుకున్నట్టుగా మొత్తం గోల్డ్ బ్యాక్ డ్రాప్ లో డిజైన్ చేసిన ఈ లోగో చాలా ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి మాత్రం ఈసారి కూడా బిగ్ బాస్ షో అదరగొట్టేలా ఉందనిపిస్తుంది. మరి డేట్ ఏదో ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :