దీపావళికి ‘మంచి రోజులు వచ్చాయి’ !

Published on Oct 3, 2021 7:13 pm IST

వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. సంతోష్ శోభన్ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ గా చేస్తున్నారు. మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా దీపావళి స్పెషల్ గా నవంబర్ 4వ తేదీన రిలీజ్ కాబోతుంది అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వి సెల్యులాయిడ్, SKN నిర్మిస్తున్నారు.

టాక్సీవాలా తర్వాత SKN నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. ఇక ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్ తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునేలా ఫుల్ ఎంటర్ టైన్ గా ఈ సినిమా ఉండబోతుందట. ఇక సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :