గెట్ రెడీ.. ‘మాస్ జాతర’ నుంచి అవైటెడ్ క్లారిటీకి సమయం ఖరారు!?

గెట్ రెడీ.. ‘మాస్ జాతర’ నుంచి అవైటెడ్ క్లారిటీకి సమయం ఖరారు!?

Published on May 28, 2025 4:33 PM IST

Mass Jathara

మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “మాస్ జాతర”. ఈ సినిమా అనౌన్స్ చేసి ఒకో అప్డేట్ ఇస్తున్న కొద్దీ మరిన్ని అంచనాలు ఈ చిత్రం పెంచుకుంటూ వెళుతుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ ఈపాటికే కావాల్సి ఉంది కానీ పలు కారణాలు చేత ఆలస్యం అయ్యింది.

ఇక ఫైనల్ గా ఆ రిలీజ్ ఎపుడు అనేది ఒకింత సస్పెన్స్ గా మారడంతో మాస్ ఫ్యాన్స్ ఆ క్లారిటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఫైనల్ గా దీనికి తెర పడనుంది అని ఇపుడు చెప్పొచ్చు. ఈ చిత్రం నుంచి రేపు మే 29న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి సాలిడ్ అప్డేట్ ని అందిస్తున్నట్టుగా మేకర్స్ ఇపుడు కన్ఫర్మ్ చేసేసారు. దీనితో ఇది దాదాపు కొత్త రిలీజ్ డేట్ కోసమే అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుండగా భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు