ఓటిటి స్ట్రీమింగ్ కు సిద్ధ‌మైన ‘రాజు యాదవ్’

ఓటిటి స్ట్రీమింగ్ కు సిద్ధ‌మైన ‘రాజు యాదవ్’

Published on Jul 9, 2024 3:35 PM IST

బుల్లితెర‌పై త‌న‌దైన కామెడీతో మంచి గుర్తింపు పొందిన జ‌బ‌ర్ద‌స్త్ గెట‌ప్ శ్రీ‌ను, వెండితెర‌పై కూడా న‌వ్వులు పూయిస్తూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో ఆయ‌న హీరో ఫ్రెండ్ క్యారెక్ట‌ర్లు చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. అయితే, గెట‌ప్ శ్రీ‌ను ఇటీవ‌ల హీరోగా కూడా మారాడు. ‘రాజు యాద‌వ్’ అనే సినిమాతో ఆయ‌న హీరోగా మారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

మే 24న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన రాజు యాద‌వ్ మూవీ, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో రాజు యాద‌వ్ మూవీ స్ట్రీమింగ్ కు సిద్ధ‌మ‌య్యింది. ఈ సినిమాను త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే స్ట్రీమింగ్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేయ‌లేదు.

కృష్ణ‌మాచారి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అంకిత కార‌త్ హీరోయిన్ గా న‌టించింది. ఆనంద్ చ‌క్ర‌పాణి, రాకెట్ రాఘ‌వ‌, మిర్చి హేమంత్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్, సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు