గని నుంచి నేడు మోస్ట్ అవైటెడ్ అప్డేట్..!

Published on Nov 11, 2021 3:02 am IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. ఈ చిత్రం ను డిసెంబర్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు సినిమా పై ఇప్పటికే ఆసక్తిని పెంచేశాయి.

అయితే తాజాగా ఈ చిత్రం నుండి నేడు మరో మోస్ట్ అవైటెడ్ అప్డేట్ రాబోతుంది. నేడు ఉదయం 10:30 గంటలకు “గని”ని పరిచయం చేయబోతున్నట్టుగా చిత్ర బృందం తెలిపింది. ఇకపోతే అల్లు అరవింద్ గారి పెద్దబ్బాయి బాబీ ఈ సినిమాను నిర్మిస్తుండగా, తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More