మన టాలీవుడ్ దగ్గర పేరు మోసిన ప్రముఖ కుటుంబాల్లో ఘట్టమనేని ఫ్యామిలీ కూడా ఒకటి. వారి కుటుంబం నుంచి లేటెస్ట్ గా డెబ్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న యువ హీరోనే జయకృష్ణ ఘట్టమనేని. దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో చేస్తున్న చిత్రమే ‘శ్రీనివాస మంగాపురం’. బాలీవుడ్ బ్యూటీ రాషా తడానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకోవచ్చింది.
అయితే ఈ సినిమాపై లేటెస్ట్ రిపోర్ట్ తెలిసిందే. ప్రస్తుతం మేకర్స్ ఇంటెన్స్ క్లైమాక్స్ యాక్షన్ షూట్ లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. యంగ్ హీరో జయకృష్ణ మరియు విలన్ రోల్ చేస్తున్న అజయ్ గ్యాంగ్ నడుమ ఓ క్వారీలో ఈ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ని దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారట.
మండుటెండలో కూడా మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా యాక్షన్ పార్ట్ ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే జయ్ కూడా సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది. అలాగే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సినిమాలో బాగా వచ్చాయట. ఇక ఈ పార్ట్ కంప్లీట్ అయితే సినిమా పూర్తయిపోయినట్టే అని తెలుస్తుంది. దీని తర్వాత సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది మేకర్స్ ఫిక్స్ చేస్తారట.


