‘ఘాజి’ సినిమా తాప్సికి రీఎంట్రీ కానుందా !


‘ఝమ్మంది నాదం’ సినిమాతో తెలుగులో పరిశ్రమలు పరిచయమైన హీరోయిన్ తాప్సి ‘మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం’ వంటి హిట్ సినిమాలతో పాటు గ్లామర్ కు స్కోప్ ఉన్న సినిమాల్లో నటించింది. అయినా కూడా ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో బ్రేక్ రాలేదు. దీంతో ఆమె తమిళ, హిందీ పరిశ్రమలపై దృష్టి పెట్టి మంచి విజయాలందుకుంది. వరుసగా బాలీవుడ్ లో పలు ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ అనే పేరు కూడా తెచ్చుకుంది.

ప్రస్తుతం ఆమె తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానున్న రానా ‘ఘాజి’ చిత్రంలో బంగ్లాదేశ్ శరణార్థిగా ఒక ప్రధాన పాత్ర పోషించింది. ఈ పాత్ర ఆమెకు తెలుగులో కూడా మంచి నటిగా ఇంతకు ముందు లేని గుర్తింపును తెచ్చిపెడుతుందని, ఇది ఖచ్చితంగా ఆమెకు రీ ఎంట్రీ అవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ఈ పాత్ర కోసం ఆమె స్వయంగా కష్టపడి బెంగాలి నేర్చుకుని చాలా సహజ సిద్ధంగా నటించిందట. ఈ పాత్ర తెలుగు వారికి బాగా దగ్గరవుతుందని, మరిన్ని సినిమా అవకాశాలను తెచ్చిపెడుతుందని తాప్సి కూడా నమ్మకంగా ఉందట. మరి ఫిబ్రవరి 17న ఈ చిత్రం ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి.